లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న
బీజేపీకి, అదే స్థాయిలో వివిద వర్గాల్లోని ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. పారిశ్రామిక వేత్తలు, న్యాయనిపుణులు,
సామాజికవేత్తలు, చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖలు బీజేపీలో చేరుతున్నారు. మరోసారి
ఎన్డీయే ను ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.
తాజాగా నటి రూపాలీ గంగూలీ బీజేపీలో
చేరారు. దిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయంలో వినోద్ తావ్డే, అనిల్ బలూని సమక్షంలో ఆమె కాషాయ కండువా మెడలో
వేసుకున్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే పాలనలో అభివృద్ధి పనులు మహాయజ్ఞంలో
సాగుతున్నాయని వాటితో తాను భాగం కావాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు
తెలిపారు.
రూపాలీ గంగూలీ దర్శకుడు అనిల్ గంగూలీ కూతురు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్
ప్రారంభించిన రూపాలీ, ఆపై పలు టీవీ సీరియల్స్ ద్వారా మంచి
పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై అత్యధికంగా పారితోషకం అందుకున్నారు.
బాలీవుడ్ కు చెందిన కంగనా రనౌత్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి
కమలం గుర్తుపై పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు.