దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ లో
దారుణం జరిగింది. హైవే రోడ్డులో కొంత భాగం కుంగడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాంగ్డాంగ్
ప్రావిన్స్‌లోని మీజౌ, డాబు కౌంటీ నగరాల మధ్య ఉన్న రోడ్డులో కొంతమేర
ఈ తెల్లవారు జామున 2:10 గంటల ప్రాంతంలో కుంగింది.
ఈ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న 18 వాహనాల్లోని 49 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే సహాయ చర్యలు చేపట్టిన
అధికారులు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారిలో 19 మంది చనిపోయారు. మరో 30 మందికి చికిత్స
అందిస్తున్నారు.
గ్వాంగ్డాంగ్ ప్రాంతంలో ఇటీవల వరుస
ప్రకృతి వైఫరిత్యాలు సంభవించాయి. వరదలు కూడా సంభవించాయి. వీటి కారణంగానే రోడ్డు
కుంగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు