దేశ
రాజధాని దిల్లీలోని ప్రముఖ స్కూళ్ళకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన
ప్రభుత్వం కొన్ని పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించింది. ఎన్సీఆర్
ప్రాంతంలోని పలు స్కూళ్ళకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్కూళ్ళ
యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్
సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
ద్వారక, చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్, నోయిడా సహా 100 పాఠశాలలకు
ఈ-మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
కొన్ని
స్కూళ్ళలో ఈ రోజు పరీక్షలు జరుగుతుండగా వాటిని మధ్యలోనే నిలిపివేసి విద్యార్థులను
ఇంటికిపంపారు. విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు.
ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో
తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశాల నుంచి పంపినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఫిబ్రవరిలోనూ
ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. పోలీసులు
తనిఖీలు జరపగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
ఒకే సమయంలో ఇన్ని స్కూళ్లను బెదిరింపులు రావడంతో ప్రజలు తీవ్ర
భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై
స్పందించింది. ‘‘ఈ బెదిరింపు మెయిల్స్ నకిలీ మాదిరిగానే కన్పిస్తున్నాయి.
ప్రజలెవరూ కంగారుపడొద్దు. పోలీసులు, భద్రతా
ఏజెన్సీలు తనిఖీలు చేపడుతున్నాయి’’ అని హోంశాఖ అధికారి వెల్లడించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు