హోటళ్ళు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గింది. 19 కిలోగ్రాముల సిలిండరుపై చమురు విక్రయ సంస్థలు రూ.19 తగ్గించాయి. దిల్లీలో ధర రూ.1,764.50 నుంచి రూ.1,745.50కు చేరగా, హైదరాబాద్లో మాత్రం ధర రూ.1,994.50గా ఉంది.
గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.855 గా ఉంది. ఉజ్వల్ పథకం కింద సిలిండర్ పొందే వారికి మాత్రం రూ. . 502కే లభిస్తోంది. వీరికి రూ.300 వరకు రాయితీ వస్తుంది.
గత నెలలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను రూ.30.50 తగ్గించాయి. మార్చిలో రూ.25.50, ఫిబ్రవరిలో రూ.14 పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లోని కదలికలకు అనుగుణంగా దేశీయంగానూ కంపెనీలు ప్రతినెలా ధరలను సవరిస్తున్నాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు