Tadepalligudem Assembly Constituency Profile
పశ్చిమ
గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ
నియోజకవర్గం పరిధిలో రెండు మండలాలు ఉన్నాయి. అవి తాడేపల్లిగూడెం, పెంటపాడు.
గూడెం అసెంబ్లీ
స్థానంలో 1952 నుంచి 1978 వరకూ ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. మధ్యలో 1972లో
ఒక్కసారి స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో
తెలుగుదేశం విజయం సాధించింది. మధ్యలో 1987 ఉపయెన్నికలో మాత్రం కాంగ్రెస్
గెలిచింది.
2004లో కొట్టు
సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ
అభ్యర్ధి ఈలి వెంకట మధుసూదనరావు అలియాస్ ఈలి నాని, కాంగ్రెస్ అభ్యర్ధి కొట్టు
సత్యనారాయణను ఓడించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బిజెపి
అభ్యర్ధి పైడికొండల మాణిక్యాలరావు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి తోట పూర్ణగోపాల సత్యనారాయణ
మీద విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి కొట్టు సత్యనారాయణ,
తెలుగుదేశం అభ్యర్ధి ఈలి నాని మీద గెలుపు కైవసం చేసుకున్నారు. అప్పుడు జనసేన
అభ్యర్ధి బొలిశెట్టి శ్రీనివాస్ మూడోస్థానంలో నిలిచారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్సిపి తరఫున సిట్టింగ్
ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఎన్డిఎ కూటమి తరఫున జనసేన పార్టీ
అభ్యర్ధిగా బొలిశెట్టి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా మార్నీడి శేఖర్ నిలబడ్డారు.