ఖిలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నంలో భారత గూఢచర్య సంస్థ ప్రమేయం ఉందంటూ అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసిన కథనాలపై భారత్ ఘాటుగా స్పందించింది.సున్నితమైన అంశంపై నిరాధార కథనాలు రాయడంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ ఘాటుగా సమాధానం చెప్పారు.
ఉగ్రవాదులు, వ్యవస్థీకృత నేరగాళ్ల లింకులపై అమెరికా అందించిన డేటాను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. కమిటీ దర్యాప్తు జరుపుతున్న సమయంలో ఇలాంటి ఊహాజనితమైన కథనాలు రాయడం ఏమాత్రం మంచిది కాదని జైశ్వాల్ తీవ్రంగా మండిపడ్డారు.
యూఎస్‌లో సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు ప్రతినిధిగా వ్యవహరిస్తోన్న పన్నూ…ఖలిస్థాన్ కీలక నేతగా ఉన్నారు. పన్నూను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది.భారత గూఢచర్య సంస్థ సహకారంతో పన్నూపై హత్యాయత్నం చేశారంటూ వాషింగ్టన్ పోస్ట్ రాసిన కథనాలను భారత్ కొట్టివేసింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు