Tanuku Assembly Constituency Profile
పశ్చిమ
గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గం 1951లో ఏర్పాటయింది. ఈ నియోజకవర్గంలో మూడు
మండలాలు ఉన్నాయి. అవి తణుకు, అత్తిలి, ఇరగవరం.
తణుకులో 1952
ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి
గెలిచారు. 1955, 1962లో కాంగ్రెస్ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్ళపూడి
హరిశ్చంద్రప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కూడా కాంగ్రెసే విజయం
సాధించింది. 1983 నుంచి వరుసగా 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం
పసుపు జెండా ఎగరేసింది. 2004, 2009 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది.
రాష్ట్ర విభజన
తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి అరిమిల్లి రాధాకృష్ణ,
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి చీర్ల రాధాకృష్ణను ఓడించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధి కారుమూరి వెంకట నాగేశ్వరరావు టిడిపి అభ్యర్ధి అరిమిల్లి రాధాకృష్ణను ఓడించారు.
ఇప్పుడు
2024లో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి తరఫున కారుమూరి, అరిమిల్లి మూడోసారి తలపడుతున్నారు.
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా కడలి రామారావు పోటీ పడుతున్నారు.