తెలంగాణలో
పదో తరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నిర్మల్ జిల్లా 99.05
శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా, 65.10
శాతంతో వికారాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. సిద్దిపేట జిల్లా 98.65 శాతంతో
రెండో స్థానంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా 98.27 శాతంతో
మూడో స్థానంలో నిలిచింది.
బాలికలు
93.23 శాతం ఉత్తీర్ణత సాధించగా , బాలురు
89.42 శాతం బాలురు పాస్ అయ్యారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు
కాగా, ఆరు స్కూళ్ళలో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది.
గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. మొత్తం 5,05,813 మంది
విద్యార్థులు పరీక్షలు రాయగా, 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
సాధించారు.
జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు 15 రోజుల పాటు అవకాశం
కల్పించారు. రీకౌంటింగ్‌కు రూ. 500, రీవెరిఫికేషన్‌కు
రూ. 1000 చెల్లించాలని అధికారులు తెలిపారు.