విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పటమటలో ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పదంగా చనిపోయారు. నగరానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ డి.శ్రీనివాస్, ఆయన భార్య ఉష, ఇద్దరు పిల్లలు శ్రీహాన్, శైలజ, తల్లి రమణమ్మ సహా మరణించారు.
ఇవాళ ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డాక్టర్ శ్రీనివాస్ ఉరి వేసుకుని కనిపించారు. పనిమనిషి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
డాక్టర్ శ్రీనివాస్ ఇటీవల కొత్త ఆస్పత్రి ప్రారంభించారు. తీవ్రమైన నష్టాలు వచ్చాయి. అప్పులు భరించలేక శ్రీనివాస్ కుటుంబ సభ్యులను చంపి, అతను ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల గొంతులు కోసి ఉండటం, శ్రీనివాస్ ఉరి వేసుకుని చనిపోవడంతో నగరంలో విషాదం నెలకొంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు