వేసవి
సెలవులకు తోడు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఉండటంతో హైదరాబాద్ నుంచి
ఆంధ్రప్రదేశ్ కు జనం క్యూ కట్టారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో కుటుంబ సమేతంగా
ఏపీ కి చెందిన వారు సొంతూళ్ళకు బయలు దేరారు. దీంతో బస్సులు, రైళ్ళు
కిటకిటలాడుతున్నాయి. తేదీ సమీపిస్తుండటంతో
కుటుంబ సమేతంగా వెళుతున్నారు. బుకింగ్ చేసుకున్నా నెలరోజుల వరకు టికెట్ దొరకని
పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు.
ఇదే అదునుగా
భావించిన ట్రావెల్స్ యాజమానులు టికెట్ల రేట్లు భారీగా పెంచినట్లు ప్రయాణికులు
చెబుతున్నారు. రూ.800 ధర ఉండే టికెట్ కు మారు 2వేల పైనే వసూలు చేస్తున్నారని
చెబుతున్నారు.
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడిపేందుకు
సిద్ధమైంది. హైదరాబాద్- విజయవాడ మార్గంలో మరిన్ని
సర్వీసులు అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతీ పది నిమిషాలకు ఓ బస్సు మీకోసం రెడీగా
ఉంటుందని సోషల్ మీడియా అకౌంట్ లో ప్రకటించారు. ముందస్తు బుకింగ్ చేసుకుంటే ధరపై 10
శాతం రాయితీ ప్రకటిస్తున్నట్లు రిటర్న్
జర్నీకి కూడా డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపారు.
http://tsrtconline.inను సందర్శించి టికెట్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్
నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం రోజూ 120కి
పైగా బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడుపుతోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు