Narasapuram Assembly Constituency Profile
పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం
శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో రెండు మండలాలు ఉన్నాయి.
అవి మొగల్తూరు, నరసాపురం.
నరసాపురంలో 1952 ఎన్నికల్లో సిపిఐ గెలిచింది.
1967లో సిపిఎం గెలిచింది. ఆ రెండు ఎన్నికలు మినహా మిగతా అన్నిసార్లూ కాంగ్రెస్, టిడిపి
పంచుకున్నాయి. 1955, 1962, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
1983, 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ
గెలుపొందింది. 2009లోనూ, ఆ తర్వాత 2012లో జరిగిన ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం
సాధించింది.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన మొదటి
ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి బండారు మాధవనాయుడు వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కొత్తపల్లి
సుబ్బారాయుడు మీద గెలుపు సాధించారు. 2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి ముదునూరి
ప్రసాదరాజు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ మీద విజయం కైవసం చేసుకున్నారు.
టిడిపి అభ్యర్ధి బండారు మాధవనాయుడు మూడవ స్థానానికి పరిమితం అయ్యారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్‌సిపి తమ సిట్టింగ్
ఎమ్మెల్యే ప్రసాదరాజునే మోహరించింది. ఎన్‌డిఎ కూటమి తరఫున జనసేన అభ్యర్ధిగా
బొమ్మిడి నాయకర్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా కానూరి ఉదయభాస్కర కృష్ణప్రసాద్ నిలబడ్డారు.