Palakollu Assembly Constituency Profile
పశ్చిమగోదావరి
జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో మూడు
మండలాలు ఉన్నాయి. అవి పాలకొల్లు, యెలమంచిలి, పోడూరు మండలంలోని కొంతభాగం.
పాలకొల్లులో
ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే అధికారంలో ఉన్నాయి. 1952, 1955, 1962,
1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులే విజయాలు సాధించారు. మధ్యలో
ఒక్క 1967లో మాత్రం ఆ స్థానాన్ని సిపిఐ దక్కించుకుంది. 1983, 1985 ఎన్నికల్లో
కొత్త పార్టీ తెలుగుదేశం ప్రతాపం చూపించింది. 1989లో కాంగ్రెస్ గెలిచినా, మళ్ళీ
తెలుగుదేశం పుంజుకుంది. 1994, 1999, 2004 ఎన్నికల్లో మూడుసార్లు వరుసగా గెలిచింది.
2009లో మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధించింది.
రాష్ట్ర
విభజన జరిగాక 2014లోనూ, జగన్ వేవ్ బలంగా ఉన్న 2019లోనూ తెలుగుదేశం తరఫున నిమ్మల
రామానాయుడు విజయం సాధించారు. దాంతో ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా 2024లో
కూడా ఆయనే పోటీపడుతున్నారు. ఆ రెండు ఎన్నికల్లోనూ అభ్యర్ధులను మార్చిన వైఎస్ఆర్‌సిపి
ఈసారి కూడా అదే పని చేసింది. గుడాల శ్రీహరి గోపాలరావును దింపింది. ఇక ఇండీ కూటమి
తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా కొలుకులూరి అర్జున్ రావు బరిలో నిలిచారు.