అత్యాచారానికి
పాల్పడిన దుండగుడికి కేరళ ఫోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. బాలికపై
అఘాయిత్యానికి పాల్పడి గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తికి న్యాయస్థానం 106 ఏళ్ళ
జైలు శిక్ష విధించింది.
కేసు
వివరాలు ఇలా…
త్రిసూర్‌కు
చెందిన ఓ వ్యక్తి ఆదిమాలిలోని ఓ హోటల్ లో పనిచేసేవాడు. అక్కడే పనిచేసే మహిళతో
స్నేహం కుదరడంతో ఆమె నివాసంలోనే ఉండేవాడు.అయితే ఓ రోజు సదరు మహిళ, ఇతర కుటుంబసభ్యులు
ఇంట్లో లేని సమయంలో దుండగుడు మానసిక వికలాంగురాలైన బాలికపై లైంగికదాడికి
పాల్పడ్డాడు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు.
కొన్నిరోజుల
తర్వాత బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా గర్భవతి
అని తేలింది. .
వైద్యుల
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి దారుణానికి పాల్పడింది
ఎవరో తేల్చారు. బాధితురాలి నివాసంలో ఉంటున్న వ్యక్తే లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది.
డీఎన్ఏ పరీక్షల్లోనూ నిర్ధారణ జరిగింది.
నిందితుడు, పిండానికి డీఎన్ఏ పరీక్షలు
చేశారు.
కేసును
విచారించిన పోక్సోకోర్టు.. నిందితుడికి 106
ఏళ్ళ జైలు శిక్ష తో పాటు రూ. 60 వేలు జరిమానా విధించింది. దోషి జరిమానా మొత్తాన్ని
చెల్లించకుంటే అదనంగా మరో 22 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పు
చెప్పింది. నిందితుడు జరిమానా చెల్లిస్తే, ఆ
మొత్తాన్ని ఇడుక్కి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెందిన బాధితుల పరిహార పథకం
నుంచి బాలికకు అందజేయాలని కోర్టు ఆదేశించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు