పతంజలి ఫార్మాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పతంజలికి చెందిన 14 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు ఇచ్చారని తేలింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీష్ చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్‌లను పతంజలి సంస్థ ఉల్లంఘించిందని అథారిటీ నిర్థారించింది. కరోనా సమయంలో పతంజలి చేసిన ప్రచారానికి సంబంధించిన విషయాలను బలపరిచే ఆధారాలు సమర్పించడంతో సంస్థ విఫలమైంది.
ఆధునిక వైద్య విధానాలను తప్పుపడుతూ పతంజలి సంస్థ చేసిన ప్రచారంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘంగా విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం పతంజలి సంస్థ తీరును తప్పుపట్టింది. బహిరంగ క్షమాపణలు కోరుతూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు