Achanta
Assembly Constituency Profile
పశ్చిమగోదావరి
జిల్లాలోని ఆచంట అసెంబ్లీ స్థానం 1962లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు
ఉన్నాయి. అవి పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు.
1962 శాసనసభ ఎన్నికల్లో సిపిఐ గెలిచినా, ఆ తర్వాత
కాంగ్రెస్ పుంజుకుంది. 1967, 1972, 1978 ఎన్నికల్లో ఆ పార్టీ విజయాలు సాధించింది.
1983లో తెలుగుదేశం రాజకీయ రంగప్రవేశంతో పాటు ఆచంట సీటునూ గెలుచుకుంది. కానీ ఆ
పరంపరను కొనసాగించలేకపోయింది. 1985, 1989, 1984 ఎన్నికల్లో వరుసగా సిపిఎం పార్టీ
విజయాలు సాధించింది. 1999 నాటికి కమ్యూనిస్టుల ప్రభ తగ్గిపోయింది. ఆ యేటి
ఎన్నికల్లోనూ, తర్వాత 2004 ఎన్నికల్లోనూ తెలుగుదేశం గెలుపొందింది. 2009లో
కాంగ్రెస్ తరఫున పితాని సత్యనారాయణ పోటీ చేసి విజయం సాధించారు. 2014 నాటికి మారిన
పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. అప్పటి చంద్రబాబు
ప్రభుత్వంలో మంత్రిపదవి కూడా పొందారు.
2019లో
కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పితాని సత్యనారాయణ తెలుగుదేశం తరఫున పోటీ
చేసారు. కానీ జగన్ వేవ్‌లో ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెరకువాడ
శ్రీరంగనాథరాజు విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో మళ్ళీ ఆ
ఇద్దరు అభ్యర్ధులే పోటీ పడుతున్నారు. వైఎస్ఆర్‌సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజును
నిలిపింది. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా పితాని సత్యనారాయణ పోటీ
చేస్తున్నారు. ఇక ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా నెక్కంటి వెంకట
సత్యనారాయణ తలపడుతున్నారు.