టీడీపీ రెబల్ అభ్యర్థులపై వేటు పడింది. పార్టీ ఆదేశాలను దిక్కరించి రెబల్స్‌గా బరిలో నిలిచిన పలువురిని, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సస్పెండ్ చేశారు. విజయనగరం అసెంబ్లీకి రెబల్‌గా బరిలో దిగిన మీసాల గీత, అరకులో సివేరి అబ్రహాం, అమలాపురంలో పడమట శ్యాంకుమార్, పోలవరంలో ముడియం సూర్యచంద్రరావు, ఉండిలో వెంకటశివరామరాజు, సత్యవేడుకు చెందిన జడ్డా రాజశేఖర్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు.
పార్టీ నియమ నిబంధనలు దిక్కరించి అసెంబ్లీ బరిలో పోటీకి దిగిన అభ్యర్థులపై టీడీపీ వేటు వేసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియడంతో రెబల్ అభ్యర్థులను గుర్తించి చర్యలు తీసుకున్నారు. కొందరు రెబల్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమి అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు.