సందేశ్‌ఖాలీ అరాచకాలపై సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. వ్యక్తుల ప్రయోజనం కోసం న్యాయస్థానాలను ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించింది.సందేశ్‌ఖాలీ అరాచకాలపై జరుపుతోన్న సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్మెహతాల ధర్మాసనం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
సందేశ్‌ఖాలీ కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తొలగించాలని కోరవచ్చని న్యాయస్థానం సూచించింది. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్ అరెస్ట్ సందర్భంగా ఈడీ అధికారులపై దాడి చేసిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూములు ఆక్రమించుకుని చెరువులుగా మార్చడం వంటి ఘటనలపై కూడా విచారణ జరుగుతోంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు