సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి.గత వారం లాభాల్లో కొనసాగిన సూచీలు తరవాత నష్టాలను చవిచూశాయి. మరలా స్టాక్ సూచీలు లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయంగా అందుతోన్న సానుకూల సంకేతాలతో బ్యాంకింగ్ షేర్లకు మద్దతు లభించింది. సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74671 వద్ద ముగిసింది. నిఫ్టీ 223 పాయింట్లు పెరిగి 22643 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి 83.48 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధరలు కూడా స్వల్పంగా దిగివచ్చాయి. బ్యారెల్ ముడిచమురు రూ.88.90 డాలర్లకు తగ్గింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఐటీసీ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, బజాజ్ ఫిన్‌సర్వ్ తప్ప అన్ని షేర్లు లాభాలార్జించాయి. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ భారీ లాభాల్లో ముగిశాయి. మెరుగైన ఫలితాలు ప్రకటించడం ఈ బ్యాంకు షేర్ల పరుగునకు కారణమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల దూకుడు వెరసి దేశీయ స్టాక్ సూచీల భారీ పెరుగుదలకు దారితీశాయి.