బీజేపీ సీనియర నేత, కర్ణాటక చామరాజనగర్ ఎంపీ వి.శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం శ్రీనివాస ప్రసాద్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.
కర్ణాటకలోని చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి శ్రీనివాస ప్రసాద్ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. నంజన్‌గుడ్ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితానికి విరామం తీసుకుంటున్నట్లు శ్రీనివాస ప్రసాద్ ఇటీవల ప్రకటించారు. 1976లో జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1979లో కాంగ్రెస్ పార్టీలో చేశారు. జేడీఎస్, జేడీయూ, సమతా పార్టీలోనూ పనిచేశారు. ఆ తరవాత బీజేపీలో చేరి 1999లో కేంద్ర మంత్రిగా సేవలందించారు.