ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా అక్రమంగా చేస్తున్న తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. ఎన్జీటీ ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని ఆదేశించింది.
ఏపీలో జరుగుతోన్న అక్రమ ఇసుక తవ్వకాలపై కొందరు జాతీయ హరిత ట్రైబ్యునల్లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అక్రమ తవ్వకాలు నిలిపేయాలని ఎన్జీటీ తీర్పు చెప్పింది. అయినా అక్రమాలు ఆగకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎన్జీటీ తీర్పును యథావిథిగా అమలు చేయాలని ఆదేశించింది. దీనిపై మే9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఆదేశించింది. ఎన్నికలు జరుగుతున్నాయని సమయం కావాలని కోరినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఎన్నికలు ఉన్నా పర్యావరణ అంశాలు ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు