Trinamool
goons attack on BJP woman leader
కోల్కతాలో బీజేపీ నాయకురాలు
సరస్వతీ సర్కార్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమెపై దాడి జరిగింది. అధికార తృణమూల్
కాంగ్రెస్ పార్టీ గూండాలే తనపై దాడి చేసారని ఆమె ఆరోపించారు. సరస్వతి ఆదివారం నాడు
కోల్కతా దక్షిణ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఆనందపూర్ వద్ద కస్బా ప్రాంతంలో ఎంపీ
అభ్యర్ధి దేబశ్రీ చౌధురి కోసం ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమెపై దాడి జరిగింది.
సరస్వతీ సర్కార్ కస్బాలోని
మహిళా మండలి అధ్యక్షురాలు. దేబశ్రీ చౌధురి ప్రచారం కోసం పోస్టర్లు అంటిస్తుండగా
తనతో సహా పలువురు బీజేపీ కార్యకర్తల మీద దాడి చేసారని ఆమె చెబుతున్నారు. సరస్వతి
తల పగిలి రక్తం కారుతున్న దృశ్యాలు స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఒక తృణమూల్ గూండా తన తలపై తుపాకి బయొనెట్తో కొట్టాడని సరస్వతి వివరించారు.
ఆ సంఘటన తర్వాత బీజేపీ
ఎంపీ దేబశ్రీ చౌధురి, గాయపడిన సరస్వతి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. దాడికి
పాల్పడినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. ఆ మొత్తం ఘటనపై ఆనందపూర్ పోలీస్
స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఆ దాడికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి కేసూ నమోదు చేయలేదు.
తృణమూల్ దాడి ఘటనను
బీజేపీ ఖండించింది. పశ్చిమబెంగాల్లో ఏ మహిళా సురక్షితంగా లేదని ఆ పార్టీ అధికార
ప్రతినిధి అమిత్ మాలవీయ ఆరోపించారు.
త్రిపుర ముఖ్యమంత్రి
మానిక్ సాహా కూడా ఆ దాడిని ఖండించారు. బెంగాల్ ప్రజలు జరుగుతున్న ఘటనలను
గమనిస్తున్నారనీ, అటువంటి సంఘటనల పట్ల స్పందిస్తారనీ వ్యాఖ్యానించారు.
ఈ మార్చి నెలలో బెంగాల్లో
బీజేపీ కార్యకర్తలపై పలు దాడులు జరిగాయి. తాజాగా సరస్వతీ చౌధురిపై దాడితో బీజేపీ
నేతల ఆగ్రహానికి అంతు లేకుండా పోయింది. పశ్చిమబెంగాల్లో మహిళలకు భద్రత లేకుండా
పోయిందని మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈ సంఘటనలో బాధితురాలికి
న్యాయం జరగాలని డిమాండ్ చేసారు. స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆనందపూర్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన ప్రదర్శన
నిర్వహించారు. దాడి చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.