Congress
Minority Appeasement in Manifesto: PW Contracts to Minorities
కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోను ముస్లిములకు
అన్నిరకాల లబ్ధులూ చెందేలా రూపొందించడం హిందువుల్లో అభద్రతా భావాన్ని
కలిగిస్తోంది. తాజాగా, పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టుల్లో ముస్లిములకు పెద్దపీట
వేస్తామన్న కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకటన ఆ వర్గం వారిని బుజ్జగించే చర్యగా
నిలిచింది. ముస్లిం సంతుష్టీకరణలో కాంగ్రెస్ అన్ని హద్దులూ దాటేస్తోందంటూ బీజేపీ
మండిపడుతోంది.
బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ తన ట్వీట్లో
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేసిన ఆ వాగ్దానాన్ని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్
మ్యానిఫెస్టోలో మరో ఆణిముత్యం ఇలా ఉంది. ‘విద్య, వైద్యం, ప్రభుత్వోద్యోగాలు,
ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక
కార్యక్రమాల్లో వివక్ష లేకుండా మైనారిటీలకు గణనీయంగా అవకాశాలు కల్పిస్తామని హామీ
ఇస్తున్నాం.’ ప్రభుత్వ పనుల కాంట్రాక్టులలో మైనారిటీలకు (ముస్లిములు అని అర్ధం
చేసుకోవాలి) గణనీయమైన వాటా ఇస్తామని కాంగ్రెస్ ఎలా హామీ ఇవ్వగలుగుతుంది? టెక్నికల్
బిడ్, ఫైనాన్షియల్ బిడ్‌తో పాటు మతపరమైన కోటా కూడా ఉంటుందా?’’ అని ఆయన
ప్రశ్నించారు.
అమిత్ మాలవీయ ఇంకా ఇలా అడిగారు ‘‘ముస్లిములకు
లబ్ధి చేకూర్చడం కోసం నైపుణ్యం కలిగిన బిడ్డర్లను విస్మరిస్తారా? హిందూ బిడ్డర్లకు
స్వతహాగా నైపుణ్యం, సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వ కాంట్రాక్టు పొందాలంటే ముస్లిములకు
సహాయకారిగా ఉండిపోవాలా? అది టెండర్ల కుంభకోణానికి దారి తీయదా?’’ అని ప్రశ్నించారు.
‘‘ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఆస్తులను లాక్కోవడమే కాదు,
హిందూ మహిళల చిన్నచిన్న పొదుపులను లాగేసుకోవడమే కాదు, వారి బంగారాన్నీ
మంగళసూత్రాలనూ తీసేసుకోవడమే కాదు, వాటిని మైనారిటీలకు పంచిపెట్టేయడమే కాదు…
వారికి గౌరవప్రదంగా జీవించేందుకు ఉపాధి అవకాశాలను సైతం నిరాకరిస్తారా? కాంగ్రెస్ ఎలాంటి
భారతదేశాన్ని నిర్మించాలని భావిస్తోంది?’’ అని అమిత్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ‘న్యాయపత్రం’ (మ్యానిఫెస్టో)లో
ప్రభుత్వ పనుల కాంట్రాక్టులలో మైనారిటీలకు గణనీయమైన వాటా ఇస్తామని వాగ్దానం
చేసింది.