పింఛను లబ్దిదారులకు గుడ్ న్యూస్. మే నెల పింఛను బ్యాంకు ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్లను వాలంటీర్లతో పంచవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో గత నెలలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సచివాలయాల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో ఎండలకు 32 మంది వృద్ధులు చనిపోయారు. దీనిపై ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. మే నెలలో ఎండలు మరింత ముదరడంతో పింఛను బ్యాంకు ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు.
బ్యాంకు ఖాతాలు లేని వారికి, అనారోగ్యంతో తిరగలేని వారికి, దివ్యాంగులకు మే ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఇంటి వద్ద పింఛన్లు అందించాలని నిర్ణయించారు. గత నెలలో పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించుకోరాదని సీఈసీ ఆదేశించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటింటికి పింఛన్లు ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బందులకు గురిచేశారు. మే నెలలోనూ అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూడాలని ప్రతిపక్షాలు సీఈసీని, సీఎస్‌ను కోరాయి. దీంతో ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.