బీజేపీ
మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, ఎన్డీయే నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
రాహుల్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాప్రజలను తప్పుదారి పట్టించేందుకే
ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నంతవరకూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై పునరాలోచన ఉండదని తేల్చి చెప్పారు.
రిజర్వేషన్ల
విషయంలో బీజేపీ, ఎన్డీయే పై రాహుల్ గాంధీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తాము పదేళ్ళుగా
పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నామని గుర్తు చేసిన అమిత్ షా, రిజర్వేషన్లకు స్వస్తి పలకాలని అనుకుంటే
ఈపాటికే అలాంటి నిర్ణయం తీసుకునేవారమన్నారు.
బీజేపీ
అధికారంలో ఉన్నంతవరకూ రిజర్వేషన్లను తొలగించే అధికారం, ధైర్యంఎవరికీ లేదని ప్రధాని నరేంద్ర
మోదీ భరోసా ఇచ్చారని అమిత్ షా గుర్తుచేశారు.