ఉల్లి ఎగుమతులకు సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నుంచి ఆరు దేశాలకు 99,500 టన్నుల ఎగుమతికి అనుమతులు ఇచ్చింది. దీంతో మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం కలగనుంది.
మిడిల్ ఈస్ట్, మరికొన్ని ఐరోపా దేశాలకు 2,000 టన్నుల తెల్ల ఉల్లి ఎగుమతులకు కూడా అనుమతిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
గతేడాది డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. తాజాగా ఆంక్షల ఎత్తివేసింది. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, యూఏఈలకు ఎగుమతి చేసేందుకు అనుమతించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు