పాక్ పన్నాగాన్ని భారత నౌకాదళ సిబ్బంది భగ్నం చేశారు. రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుజరాత్ సమీపంలో సముద్ర మార్గం ద్వారా తరలిస్తుండగా కోస్ట్ గార్డ్స్ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద వ్యతిరేక దళం, కోస్ట్ గార్డ్స్ నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో డ్రగ్స్ తరలిస్తోన్న పడవను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తోన్న 14 మంది స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేశారు.
గత రాత్రి ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ ముఠా నుంచి 86 కేజీల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. డ్రగ్స్ తరలిస్తోన్న పడవ పాక్‌కు చెందినదిగా గుర్తించారు.ఈ ఆపరేషన్‌లో ఎన్సీబీ, ఏటీఎస్ బలగాలు పాల్గొన్నాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు