లోక్సభ
ఎన్నికల్లో భాగంగా రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీకే మద్దతు
తెలిపారని ప్రధాని మోదీ అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న
ప్రధాని మోదీ, ఎన్నికల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేసే విపక్షనేతలకు ప్రజలే తగిన
బుద్ధి చెబుతారన్నారు. పొరపాటున ఇండీ కూటమి అధికారంలోకి వస్తే అయిదేళ్లలో
అయిదుగురు ప్రధానులు ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారని సెటైర్ వేశారు.
మహారాష్ట్రలో
నకిలీ శివసేన కాంగ్రెస్ పక్షాన నిలిచిందని దుయ్యబట్టిన మోదీ, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే బతికుంటే
ఇదంతా చూసి బాధపడేవారన్నారు.
విపక్ష
కూటమికి మూడంకెల సీట్లు కూడా రావని అభిప్రాయపడిన ప్రధాని మోదీ, ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదన్నారు. కర్ణాటక మోడల్ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా
అమలుచేయాలని భావిస్తోందన్నారు.
ప్రస్తుతం
ఎన్డీయే ‘2-0’తో మెజారిటీతో ఉందన్న మోదీ, దేశ వ్యతిరేక విధానాలు, విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న
కాంగ్రెస్ కూటమి రెండుసార్లు సెల్ఫ్ గోల్స్ వేసుకుందన్నారు. మూడో విడతలోనూ ఇదే
రిపీట్ అవుతుందన్నారు.