రిజర్వేషన్ల
అమలుపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)
చీఫ్
మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజర్వేషన్లకు
సంఘ్ పరివార్ తొలి నుంచి మద్దుతగా నిలుస్తోందని తేల్చి చెప్పారు. రిజర్వేషన్ విషయంలో ఆర్ఎస్ఎస్ పై కొందరు
కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్
లో ఓ విద్యాసంస్థలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మోహన్ భగవత్, రిజర్వేషన్లకు RSS వ్యతిరేకమంటూ ఫేక్ వీడియోను సర్క్యూలేట్
చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తమని
తోసిపుచ్చారు.
రాజ్యాంగం
ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా RSS ఎప్పుడూ మాట్లాడలేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు.
పేదరికం, వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం
చేశారు.
రిజర్వేషన్ల
అమలుపై గతంలోనూ స్పందించిన మోహన్ భగవత్, సమాజంలో
వివక్ష, అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనన్నారు.