అమెరికాలోని
నెబ్రాస్కా రాష్ట్రాన్నిటోర్నడోలు అతలాకుతలం చేస్తున్నాయి. నల్లటి దుమ్ము, ధూళితో కూడిన భారీ ఈదురుగాలులు సుడులు
తిరుగుతూ చుట్టేస్తున్నాయి.
టోర్నడోల
బీభత్సాన్ని పలువురు సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ట్రెయిలర్
ట్రక్ టోర్నడోలో చిక్కుకొని రోడ్డు పై బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తూ ఆ వాహన
డ్రైవర్ కు ఎలాంటి హాని జరగలేదు.
ఓ పారిశ్రామిక షెడ్ పై పైకప్పు ఒక్కసారిగా
కూలిపోయింది. ఆ సమయంలో అందులో సుమారు 70 మంది ఉన్నారు. వారిలో ముగ్గురు
గాయపడ్డారు.
అమెరికావ్యాప్తంగా
ఈ వారం 70కిపైగా టోర్నడోలను సంభివించాయి. నెబ్రాస్కాలోని రవాణా హబ్ ప్రాంతమైన
ఒమాహా చుట్టుపక్కలే ఎక్కువ టోర్నడోలు వస్తున్నాయి. 11 వేల నివాసాలకు విద్యుత్
సరఫరా నిలిచిపోయింది.