కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీతో పొత్తును అర్విందర్ మొదటి నుంచి వ్యతిరేకించారు. ఆప్‌తో పొత్తు ఇష్టలేదని, అయినా తప్పలేదని ఆయన రాజీనామా లేఖలో వెల్లడించారు. ఆయన రాజీనామాను పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ అర్విందర్ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బేననే ప్రచారం సాగుతోంది.
నాడు కాంగ్రెస్ పార్టీ అవినీతిపై పోరాటం చేసేందుకు ఆప్ ఏర్పాటైందని అర్విందర్ గుర్తు చేశారు. ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని ఢిల్లీ కాంగ్రెస్ తీర్మానం చేసినట్లు చెప్పారు. అయినా అధిష్ఠానం పొత్తుకే మొగ్గు చూపిందన్నారు. డీపీసీసీ అధ్యక్షుల నియామకానికి కూడా, ఢిల్లీ ఇంఛార్జి అంగీకరించలేదన్నారు. ఢిల్లీ ఇంఛార్జ్ ఏకపక్ష నిర్ణయాలను తప్పుపట్టారు. ఆప్ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు సీట్లు కేటాయించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు