కలియుగ దైవం శ్రీ
వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని శనివారం
(27.04.2024) నాడు 81,212 మంది దర్శించుకోగా, హుండీ కానుకల ద్వారా రూ. 2.88 కోట్ల
ఆదాయం లభించింది. 41, 690 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 31 కంపార్టుమెంట్లలో
భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి సగటున 18 గంటల సమయం పడుతోంది.
మే లో ముఖ్య ఉత్సవాలు
మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం కానుండగా మే 4న
సర్వ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక
మే 10న అక్షయతృతీయ నిర్వహించనున్నారు.
మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ
రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి జరుపనున్నారు.
శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు మే 17
నుంచి 19వ తేదీ వరకు జరగనుండగా మే 22న
నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి, మే
23న శ్రీ అన్నమాచార్య జయంతి, కూర్మ
జయంతి జరపనున్నారు.