ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్ సత్తా చాటింది. షాంఘై వేదికగా జరుగుతోన్న ఆర్చరీ వరల్డ్ కప్ పోటీల్లో ఇప్పటికే భారత క్రీడాకారులు కాంపౌండ్, వ్యక్తిగత విభాగాల్లో సత్తా చాటారు. కాంపౌండ్ విభాగంలో 3, వ్యక్తిగత విభాగంలో ఒక స్వర్ణ పతకం గెలిచారు. తాజాగా మరో పసిడి పతకం గెలుచుకున్నారు. భారత జట్టు , దక్షిణ కొరియాపై 57-57, 57-55, 55-53 తేడాతో నెగ్గారు. తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, బొమ్మదేవర ధీరజ్ జట్టులో ఉన్నారు. భారత్ ఇప్పటి వరకు ఐదు స్వర్ణాలు సాధించింది.
ఆర్చరీ వరల్డ్ కప్ 2024లో భారత ఆటగాళ్లు ఆరు పతకాలు సాధించారు. ఐదు స్వర్ణం, ఒక రజతం గెలుచుకున్నారు.మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక, దక్షిణ కొరియా ప్రత్యర్థినితో తలపడనుంది. మిక్స్‌డ్ టీం కాంస్య పతకం కోసం పోరాడనుంది. వరల్డ్ నెంబర్ 3 జ్యోతి ఫైనల్లో టాప్ సీడ్ ఆండ్రియాను ఓడించింది. దీంతో అక్టోబరులో మెక్సికోలో జరగనున్న ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్స్‌కు అర్హత సాధించినట్టైంది.