తిరుపతి
శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు అయ్యాయి. మే 16 నుంచి
24 వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
మే 15న అంకురార్పణ
జరగనుండగా ప్రతీరోజూ
ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
మొదటి రోజు 16న ఉదయం
ధ్వజారోహణం, రాత్రికి పెద్దశేష వాహనం సేవ నిర్వహించనున్నారు.
రెండో రోజు చిన్నశేష వాహన సేవ,
రాత్రికి హంస వాహనం పై నుంచి స్వామి వారు
అనుగ్రహించనున్నారు.
మూడో రోజు ఉదయం (18-05-2024) ఉదయం
సింహ వాహనంపై విహరించి, రాత్రికి
ముత్యపుపందిరి వాహనంపై దర్శనమిస్తారు. నాలుగో రోజు (19-05-2024) ఉదయం కల్పవృక్ష వాహన
సేవ, రాత్రి కి సర్వభూపాల వాహనంపై నుంచి
భక్తలును కటాక్షిస్తారు.
ఐదో రోజు ఉదయం మోహినీ అవతారంలో రాత్రికి గరుడ వాహనం సేవ
జరగనుంది. ఆరో రోజు ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రికి గజ వాహన సేవ
నిర్వహిస్తారు.
ఇక
ఏడో రోజు అంటే మే 22న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై
స్వామి ఊరేగింపుగా ఆలయ పరిసరాల్లో విహరిస్తారు. మే 23న రథోత్సవం, అశ్వవాహన సేవలు
నిర్వహిస్తారు. ఆఖరి రోజు అంటే మే 24న ఉదయం చక్రస్నానం, రాత్రికి ధ్వజావరోహణం ఉంటుంది.