భారత
సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్(pok)లోని షాక్స్‌గామ్ లోయ ప్రాంతంలో
రహదారి నిర్మాణాలు చేపట్టింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ తీసిన
చిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
భారత్‌కు
కీలకమైన సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలోనే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ రోడ్డు
నిర్మాణంతో భారత్‌కు భద్రతా పరమైన సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
షాక్స్గామ్లో
నిర్మించిన రోడ్డును బల్టిస్థాన్ నుంచి తవ్వుకున్న యురేనియం వంటి ఖనిజాల
తరలింపునకు ఉద్దేశించిందని లెఫ్టినెంట్ జనరల్ శర్మ నిపుణులు పేర్కొన్నారు.
ద్వైపాక్షిక
సరిహద్దు ఒప్పందంలో భాగంగా షాక్స్గాయ్ లోయను పాకిస్థాన్ 1963లో చైనాకు
ధారాదత్తం చేసింది. దీనిని భారత్ గుర్తించలేదు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు