బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం నాడు ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ నుంచి తప్పించాలంటూ సాహిల్ ఖాన్ పెట్టుకున్న పిటిషన్‌ను ముంబై హైకోర్టు కొట్టివేసింది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సాహిల్ ఖాన్‌కు 2023 డిసెంబరులో సమన్లు జారీ చేశారు. అయినా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ముందుస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మహాదేవ్ యాప్‌నకు బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే చేశారని, ఆ వ్యాపారంతో సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.సాహెల్ ఖాన్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ సహ యజమానిగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
బెట్టింగ్ యాప్ నిర్వాహకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని కోర్టు వ్యాఖ్యానించింది. బెట్టింగ్ యాప్ కార్యకలాపాలన్నీ అక్రమమేనని కోర్టు అభిప్రాయపడింది. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. వేలాది నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించారు. ది లయన్బుక్ 247తో సాహెల్‌కు నేరుగా సంబంధాలున్నాయని ధర్మాసనం తేల్చి చెప్పింది.