భారత్‌కు మరో సెమీకండక్టర్ల పరిశ్రమ రానుంది. జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ షార్ప్ భారత్‌లో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. పరిశ్రమ ఏర్పాటుకు 3 నుంచి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. దాదాపు రూ.25 వేల నుంచి 40 వేల కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ రానుందని తెలుస్తోంది. 1000 ఎకరాల్లో షార్ప్ ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది.
ఇప్పటికే షార్ప్ జపాన్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ నడుపుతోంది. సెమీకండక్టర్లును ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలతో షార్ప్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు