Rajahmundry Parliamentary Constituency Profile
ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా పేరుగడించిన నగరం
రాజమహేంద్రవరం. ఇప్పుడు ఆ పేరుతోనే పిలవబడుతోంది కూడా. అలాంటి రాజమండ్రి లోక్‌సభా
నియోజకవర్గం 1952లో ఏర్పాటయింది.
రాజమండ్రి పార్లమెంటరీ స్థానం పరిధిలో ఏడు
అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి
రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం.
1952లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్ధి విజయం
సాధించారు. తర్వాత 1957 నుంచీ 1980 వరకూ వరుసగా కాంగ్రెసే గెలుస్తూ వచ్చింది.
1984లో కొత్త పార్టీ తెలుగుదేశం అధికారం దక్కించుకుంటే 1989లో సినీనటి జమున
అభ్యర్ధిగా కాంగ్రెస్ విజయం కైవసం చేసుకుంది. 1991లో తెలుగుదేశం, 1996లో కాంగ్రెస్
వంతులు వేసుకున్నాయి. 1998లోనూ ఆ వెంటనే 1999లోనూ జరిగిన వరుస లోక్‌సభ ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం విశేషం. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్
అభ్యర్ధి ఉండవల్లి అరుణ్ కుమార్ గెలుపొందారు.
2014లో తెలుగుదేశం అభ్యర్ధి మురళీమోహన్ తన సమీప
ప్రత్యర్ధి వైఎస్ఆర్‌సిపికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరిపై గెలుపు
దక్కించుకున్నారు. 2019లో ఇరుపార్టీలూ తమ అభ్యర్ధులను మార్చాయి. వైఎస్ఆర్‌సిపి
నుంచి మార్గాని భరత్ తెలుగుదేశానికి చెందిన మాగంటి రూప మీద విజయం సాధించారు.
ఇక ఇప్పుడు 2024లో మళ్ళీ
అభ్యర్ధులు మారిపోయారు. అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున గూడూరి శ్రీనివాస్, ఎన్‌డిఎ
కూటమి నుంచి బిజెపి అభ్యర్ధిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి
పురందరేశ్వరి తలపడుతున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా గిడుగు
రుద్రరాజు బరిలో ఉన్నారు.