Gopalapuram Assembly Constituency Profile
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో గోదావరి దరి దాటిన
మరో నియోజకవర్గం గోపాలపురం. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉంది. ఆ స్థానం
పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి ద్వారకా తిరుమల, నల్లజెర్ల, దేవరపల్లి,
గోపాలపురం.
గోపాలపురం శాసనసభా నియోజకవర్గం 1962లో ఏర్పడింది.
అప్పటినుంచీ 1978 వరకూ నాలుగు దఫాలు కాంగ్రెస్ పార్టీ వరుసగా విజయాలు సాధించింది.
1983లో తెలుగుదేశం రంగంలోకి దిగినప్పటినుంచీ 2014 వరకూ ఆ పార్టీయే గెలుస్తూ వచ్చింది. మధ్యలో ఒక్క 2004లో మాత్రం
కాంగ్రెస్ గెలిచింది. ఇక 2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి తలారి వెంకటరావు
తెలుగుదేశం అభ్యర్ధి ముప్పిడి వెంకటేశ్వరరావు మీద విజయం సాధించారు.
2024 ఎన్నిక కోసం అధికార వైఎస్ఆర్‌సిపి సిట్టింగ్
ఎమ్మెల్యేకి బదులు తానేటి వనితను పోటీలోకి దింపుతోంది. తలారి వెంకటరావును కొవ్వూరుకు
మార్చింది.
ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా
మద్దిపాటి వెంకటరాజును నిలిపారు. అక్కడ కూడా గతఎన్నికలో పోటీచేసి ఓడిపోయిన
ముప్పిడి వెంకటేశ్వరరావును పక్కన పెట్టడం గమనార్హం. ఇక ఇండీకూటమి తరఫున కాంగ్రెస్
అభ్యర్ధిగా సోడదాసి మార్టిన్ లూథర్ నిలబడ్డారు.