ముంబై
నార్త్ సెంట్రల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ను
బీజేపీ బరిలో దింపింది. కమలం గుర్తు పై ఉజ్వల్ నికమ్ పోటీ చేస్తుండగా హస్తం గుర్తుపై వర్ష
గైక్వాడ్ బరిలో నిలువనున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పూనం మహాజన్ కు బదులు ఉజ్వల్
నికమ్ కు బీజేపీ సీటు కేటాయించడంతో ముంబైనార్త్ సెంట్రల్ లో రాజకీయం ఆసక్తికరంగా
మారింది.
జుడీషియరీలో
సుదీర్ఘ అనుభవం ఉన్న ఉజ్వల్ నికమ్ అనేక సంచలన కేసులను వాదించారు. 1993 పేలుళ్ళ
కేసులో కూడా వాదనలు వినిపించారు.
ప్రమోద్
మహాజన్ హత్యకేసు, గుల్షన్ కుమార్ మర్డర్, 2008 లో ముంబై పై ఉగ్రదాడి కేసుల్లో
వాదనలు వినిపించారు. 2013లో ముంబైలో జరిగిన లైంగిక దాడి కేసు విచారణలో భాగంగా
ప్రభుత్వం, ఉజ్వల్ ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. 2016లో పద్మశ్రీ
అవార్డు అందుకున్నారు.
26/11
దాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసబ్ కు ఉరిశిక్ష పడిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఉజ్వల్
నికమ్, దానిని భారత విజయంగా అభివర్ణించారు. కసబ్ ను ఉరితీసి ఉగ్రదాడిలో ప్రాణాలు
కోల్పోయిన పోలీసులు, సామాన్య ప్రజలకు భారత ప్రభుత్వం నివాళులు అర్పించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2009,
2014లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్ విజయం సాధించగా 2014, 2019లో
బీజేపీ నుంచి పూనం మహాజన్ గెలిచారు.
ఈ
సారి మహాజన్ అభ్యర్థిత్వం పట్ల పలు సర్వేల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఉజ్వల్ ను
బీజేపీ బరిలోకి దింపింది. మహేశ్ జెఠల్మానీ
కూడా గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేశారు.