Rajahmundry City Assembly Constituency Profile
మొదట్లో రాజమండ్రి శాసనసభా నియోజకవర్గంగా ఉన్న
స్థానం 2008లో రాజమండ్రి సిటీగా ఏర్పడింది. గోదావరీ తీరాన ఉన్న ఈ స్థానం పరిధిలో
రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్‌లోని 76 వార్డులు ఉన్నాయి.
రాజమండ్రి నియోజకవర్గంలో 1952లో సిపిఐ తరఫున
చిట్టూరి ప్రభాకర చౌదరి గెలిచారు. 1955లో ప్రజా పార్టీ తరఫున ఎబి నాగేశ్వరరావుగారు
విజయం సాధించారు. 1962లో కాంగ్రెస్ నుంచి పి వీరభద్రరావు గెలుపొందారు. 1967లో
మళ్ళీ సిపిఐ నుంచి చిట్టూరి ప్రభాకర చౌదరి గెలిచారు. 1972, 1978 ఎన్నికల్లో
కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. 1983, 1985 ఎన్నికల్లో అన్నిచోట్లలాగే రాజమండ్రిలోనూ
తెలుగుదేశం గెలిచింది. 1989లో కాంగ్రెస్ పుంజుకున్నా మళ్ళీ 1994, 1999 ఎన్నికల్లో
టిడిపి హవా కొనసాగింది. 2004లో కాంగ్రెస్ నుంచి రౌతు సూర్యప్రకాశరావు గెలిచారు.
2008లో నియోజకవర్గం రాజమండ్రి నుంచి రాజమండ్రి
సిటీగా మారింది. 2009లో కాంగ్రెస్ నుంచి రౌతు సూర్యప్రకాశరావు మరోసారి గెలుపు
దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి
బిజెపి అభ్యర్ధి ఆకుల సత్యనారాయణ విజయం సాధించారు. 2019లో తెలుగుదేశం అభ్యర్ధి
ఆకుల భవాని వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి రౌతు సూర్యప్రకాశరావుపై గెలుపొందారు.
ఇప్పుడు 2024లో జరుగుతున్న ఎన్నికల్లో అధికార
వైఎస్ఆర్‌సిపి తమ అభ్యర్ధిగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను శాసనసభ బరిలో
మోహరించింది. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి వాసును రంగంలోకి
దించింది. ఇక ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
పోటీ చేస్తున్నారు.