వైసీపీ
మేనిపెస్టోను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లి లో వైసీపీ మేనిఫెస్టో-2024
ను చదివి వినిపించిన సీఎం జగన్, రెండు
విడతల్లో సామాజిక పింఛనను రూ.3,500 దాకా పెంచుతామని వాగ్దానం చేశారు. అమ్మ
ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత పథకాలు కొనసాగిస్తామన్న జగన్ , వైఎస్సార్ చేయూత సాయాన్ని రూ.75
వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంచుతామన్నారు.
అమ్మఒడి
పథకాన్ని రెండువేలు పెంచి లబ్ధిదారులకు 17వేలు
అందజేస్తామన్నారు. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తామని మేనిఫెస్టోలో
పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరిస్తామన్న జగన్ , వైఎస్సార్ కాపు నేస్తం
పథక సాయాన్ని 60 వేల నుంచి లక్షా 20వేలకు పెంచి నాలుగు దఫాల్లో
అందజేస్తామన్నారు.
ఈబీసీ
నేస్తం కింద అందజేసే నగదు సాయాన్ని కూడా 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంచుతామన్నారు. వైఎస్సార్
సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం అందజేస్తామన్నారు. వైఎస్సార్
కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కొనసాగింపుతో
పాటు అర్హుకు ఇళ్ల పట్టాల అందజేస్తామన్నారు.
గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు
చరిత్రలోనే నిలిచిపోతుందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు
తోడుగా ఉన్నామన్నారు. కోవిడ్ లాంటి
కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని చెప్పారు.
మాట్లాడితే
చంద్రబాబు సంపద సృష్టిస్తానంటారన్న జగన్, చంద్రబాబు 14
ఏళ్ల పాలనలో ప్రతీ ఏడాదిలోనూ రెవెన్యూ లోటే కనిపించిందన్నారు.