ఎర్ర
సముద్రంలో నౌకలపై హౌతీల దాడులు ఆగడంలేదు. విరామం
ఇచ్చినట్లే ఇచ్చి దాడులకు పాల్పడుతున్నారు. భారత్ కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే
చమురు ట్యాంకర్ నౌకపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తాజాగా దాడికి తెగబడ్డారు.
గాజా
యుద్ధంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనీయులకు మద్దతుగా వాణిజ్య
నౌకలపై దాడులకు పాల్పడుతున్నట్లు యెమెన్ హౌతీలు ప్రకటించారు.
దాడికి
గురైన నౌక బ్రిటిష్ యాజమాన్యానికి చెందినదిగా తేలింది.
రష్యాలోని ప్రిమోర్క్స్
నుంచి గుజరాత్‌లోని వడినార్‌కు నౌక వస్తుండగా
హౌతీలు క్షిపణితో దాడి చేశారు.
గాజాలో
ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా గతేడాది నవంబర్ నుంచి నౌకలపై హైతీలు దాడులు
చేస్తున్నారు. ఇజ్రాయెల్,
అమెరికా, బ్రిటన్ల కు చెందిన నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు.