Mandapeta Assembly Constituency Profile
మండపేట నియోజకవర్గం 2008లో ఏర్పడింది. మొదట్లో అంటే
1952 ఎన్నికలకు ముందు పామర్రు నియోజకవర్గం ఉండేది. 1978నాటికి దాన్ని ఆలమూరు
స్థానంగా మార్చారు.
మండపేట నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు
ఉన్నాయి. అవి మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం.
పామర్రు నియోజకవర్గంగా ఉన్నప్పుడు అంటే 1952
నుంచి 1972 వరకూ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. 1967లో మాత్రం స్వతంత్ర అభ్యర్ధి
గెలిచారు. 1978లో ఆలమూరు నియోజకవర్గంలో మొదటిసారి పోటీలో కాంగ్రెస్ విజయం
సాధించింది, తర్వాత 1983, 1985లో తెలుగుదేశం విజయం సాధించింది. 1989లో కాంగ్రెస్ ఉనికి
చాటుకుంది. 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు సొంతం చేసుకుంది. 2004లో కాంగ్రెస్
గెలిచింది. మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన మొదటి
ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, వైఎస్ఆర్
కాంగ్రెస్ తరఫున జి వెంకటస్వామినాయుడు తలపడ్డారు. ఆ ఎన్నికల్లో జోగేశ్వరరావు
గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి జోగేశ్వరరావు, వైసీపీ నుంచి పిల్లి
సుభాష్ చంద్రబోస్ తలపడ్డారు. అప్పుడు కూడా జోగేశ్వరరావు గెలిచి హ్యాట్రిక్ పూర్తి
చేసుకున్నారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి
నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం
అభ్యర్ధిగా వేగుళ్ళ జోగేశ్వరరావు నిలబడ్డారు. రెండో హ్యాట్రిక్ ప్రారంభించాలని
ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కామన
ప్రభాకరరావు బరిలోకి దిగారు.