స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐదు రోజుల లాభాలకు బ్రేక్ పడింది.పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. లాభాల స్వీకరణకుతోడు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీగా తగ్గాయి. సెన్సెక్స్ 600, నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయాయి.
ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. తరవాత నష్టాల్లోకి జారుకున్నాయి.ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ 600 పాయింట్ల నష్టంతో 74509 వద్ద ముగిసింది. నిప్టీ 150 పాయింట్ల నష్టంతో 22400 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి విలువ 83.35 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో విప్రో, ఐటీసీ, టెక్ మహీంద్రా, టైటన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టపోయాయి. చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్యారెల్ ముడిచమురు 89.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.