భారత్
లో వారసత్వ పన్ను అమలు చేయాలంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శాం
పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది.
ఈ
విషయంలో కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ తూర్పార పడుతుండగా
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. వారసత్వ పన్ను విధిస్తే
దేశం మళ్ళీ వెనక్కి పోతుందని, ఈ
పదేళ్ళలో జరిగిన అభివృద్ధి సున్నాకు
చేరుకుంటుందన్నారు.
రెండో
విడత పోలింగ్లో భాగంగా కర్ణాటకలో ఓటు హక్కు వినియోగించుకున్న నిర్మలా సీతారామన్
మీడియాతో మాట్లాడారు. వారసత్వ పన్ను మధ్యతరగతికి గుదిబండలా మారుతుందన్నారు. ప్రజల కష్టాన్ని లాక్కున్నట్లు అవుతుందన్నారు. మధ్యతరగతికి
చెందిన వ్యక్తులు ఫిక్సడ్ డిపాజిట్లు, చిన్న
మొత్తాల్లో పొదుపు చేసుకుంటూ సొంతింటి కలలను నెరవేర్చుకుంటారన్నారు. వారసత్వ పన్ను
విధిస్తే భవిష్యత్ కోసం దాచుకోవడమే
అప్పుడు పాపంగా మారుతుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో 90 శాతం పన్నులు విధించిన రోజులు కూడా ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. 1968లో నిర్బంధ డిపాజిట్ స్కీమ్ ఉండేదని, 18 నుంచి 20 శాతం సొమ్మును డిపాజిట్ చేయాల్సి వచ్చేదన్నారు.