Amalapuram Assembly Constituency Profile
కోనసీమ అంటే మొదట గుర్తొచ్చే పేరు అమలాపురమే.
అక్కడ శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. అప్పటినుంచి 2004 వరకూ జనరల్
కేటగిరీలోనే ఉండేది. 2008 పునర్వ్యవస్థీకరణలో అమలాపురాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మార్చారు.
అమలాపురం శాసనసభా స్థానంలో మూడు మండలాలు ఉన్నాయి.
అవి ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం.
అమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో 1952లో కృషి
మజ్దూర్ ప్రజాపార్టీ గెలిచింది. ఆ తర్వాత 1955, 1962, 1967 ఎన్నికల్లో స్వతంత్ర
అభ్యర్ధులే గెలిచారు. 1965లోనూ ,1972లోనూ కాంగ్రెస్ గెలుపు సొంతం చేసుకోగలిగింది. 1978లో
జనతా పార్టీ పదవిలోకి వచ్చింది. 1983లో తెలుగుదేశం గెలిచినా 1985, 1989లో ముమ్మిడివరాన్ని
కాంగ్రెస్ సొంతం చేసుకుంది. 1994, 1999లో మళ్ళీ తెలుగుదేశం గెలుపు దక్కించుకోగలిగింది.
2004లో రాజశేఖర రెడ్డి హవాలో కూడా స్వతంత్ర అభ్యర్ధి గెలిచాడు.
కానీ 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి పినిపే విశ్వరూపు
ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి చింతా కృష్ణమూర్తిపై గెలుపు సాధించారు. 2011లో
విశ్వరూపు వైఎస్ఆర్సిపిలో చేరారు. 2014లో టిడిపి నుంచి అయితాబత్తుల ఆనందరావు
వైఎస్ఆర్సిపి అభ్యర్ధి గొల్ల బాబూరావును ఓడించారు. 2019లో అదే ఆనందరావును
వైఎస్ఆర్సిపి అభ్యర్ధి పినిపే విశ్వరూపు ఓడించారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి సిట్టింగ్
ఎమ్మెల్యే విశ్వరూపును మోహరించింది. ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అయితాబత్తుల
ఆనందరావును బరిలోకి దించింది. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అయితాబత్తుల సుభాషిణిని
నిలబెట్టింది.