Mummidivaram Assembly Constituency Profile
ముమ్మిడివరం నియోజకవర్గం 1978లో ఏర్పడింది.
అంతకుముందు చెయ్యేరు నియోజకవర్గం ఉండేది. అంతేకాదు. 1978 నుంచి 2004 వరకూ
ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గంగా ఉండేది. 2008 పునర్‌వ్యవస్థీకరణలో ఈ సీటు జనరల్‌గా
మారింది.
ముమ్మిడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి.
అవి ఐలాండ్ పోలవరం, ముమ్మిడివరం, తాళ్ళరేవు, కాట్రేనికోన.
మొదట్లో చెయ్యేరు నియోజకవర్గం ఉన్నప్పుడు 1955,
1962, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1967లో మాత్రం స్వతంత్ర
అభ్యర్ధి గెలిచారు. 1978లో ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గం ఏర్పడినప్పుడు కూడా
కాంగ్రెసే గెలిచింది. 1983, 1985ల్లో మాత్రం తెలుగుదేశం గెలిచింది. మళ్ళీ 1989,
1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది. ఆ తర్వాత 1996, 1998, 1999 ఎన్నికల్లో
తెలుగుదేశం జెండా ఎగిరింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
దక్కించుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత మొదటి ఎన్నికలు జరిగిన 2014లో
తెలుగుదేశం గెలిచింది. టిడిపి అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు (బుచ్చిరాజు) వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధి జివిఎస్ శ్రీనివాసరావు మీద విజయం సాధించారు. 2019లో పరిస్థితి
తిరగబడింది. తెలుగుదేశం అభ్యర్ధి బుచ్చిరాజుని వైఎస్ఆర్‌సిపి కొత్త అభ్యర్ధి
పొన్నాడ వెంకట సతీష్ ఓడించారు.
ఇప్పుడు 2024 ఎన్నికలకు
ప్రధాన పార్టీలు రెండూ తమ పాత అభ్యర్ధులనే మోహరించాయి. వైఎస్‌ఆర్‌సిపి తరఫున
సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ బరిలోకి దిగారు. ఎన్‌డిఎ కూటమి తరఫున
టిడిపి అభ్యర్ధిగా దాట్ల సుబ్బరాజు (బుచ్చిరాజు) పోటీ పడుతున్నారు. ఇక ఇండీ కూటమి
తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా పాలేపు ధర్మారావు నిలబడ్డారు.