Ramachandrapuram Assembly Constituency Profile
కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలోని శాసనసభా
నియోజకవర్గం రామచంద్రాపురం. ఆ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. రామచంద్రాపురం
అసెంబ్లీ స్థానం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి కాజులూరు, రామచంద్రాపురం,
పామర్రు.
రామచంద్రాపురం నియోజకవర్గానికి మొదటిసారి
ఎన్నికలు 1952లో జరిగాయి. ఆ ఎన్నికల్లో కృషి మజ్దూర్ ప్రజా పార్టీ గెలిచింది.
1955లో ప్రజా పార్టీ గెలిచింది. 1962, 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు.
1970లో ఎన్‌సిజె పార్టీ గెలిచింది. 1972లో కాంగ్రెస్ మొదటిసారి గెలిచింది. 1978లో
పిల్లి అప్పారావు స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించారు. 1983, 1985ల్లో ఆంధ్రప్రదేశ్‌లో
తెలుగుదేశం హవా రామచంద్రాపురంలోనూ ప్రభావం చూపించింది. 1989లో కాంగ్రెస్ తరఫున
పిల్లి సుభాష్ చంద్రబోస్ విజయం సాధించారు. 1994లో తోట త్రిమూర్తులు స్వతంత్ర అభ్యర్ధిగా
గెలిచారు. ఆయనే 1999లో తెలుగుదేశం టికెట్ మీద గెలిచారు. 2004, 2009లో కాంగ్రెస్
అభ్యర్ధిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ విజయం సాధించారు. తోట త్రిమూర్తులు 2012లో
కాంగ్రెస్ తరఫున, 2014లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలుపు దక్కించుకున్నారు.
2019లో చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా విజయం
సాధించారు.
2024లో వైఎస్ఆర్‌సిపి తరపున పిల్లి సూర్యప్రకాష్
పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్
బరిలోకి దిగారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోట శ్రీనివాసరావు నిలబడ్డారు.