సాంకేతిక లోపాలు తలెత్తడంతో వేలాది ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు (icici creditcards) బ్లాక్ అయ్యాయి. ఈ విషయాన్ని బ్యాంక్ ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. దాదాపు 17 వేల క్రెడిట్ కార్డులు పనిచేయడం లేనది బ్యాంక్ అధికారులు ప్రకటించారు. వేలాది కార్డులు పొరపాటున ఇతరుల ఖాతాలకు లింకైనట్లు గుర్తించారు. వెంటనే వాటిని సవరించారు.
సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని బ్యాంకు సిబ్బంది గుర్తించారు. ఎవరైనా నష్టపోతే వారికి బ్యాంకు పరిహారం చెల్లిస్తుందన్నారు. ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డులకు కొత్త కార్డులు తప్పుగా లింకయ్యాయని గుర్తించారు. దీని వల్ల ఒకరి కార్డు వివరాలు ఉండాల్సిన చోట మరొకరి వివరాలు రావడంతో ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు.
తాజాగా గుర్తించిన లోపాల వల్ల మోసాలు జరిగినట్లు ఇంత వరకు నమోదు కాలేదు. ఓటీటీ లేకుండా డబ్బు బదిలీ సాధ్యం కాదని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు