కాంగ్రెస్
మేనిఫెస్టో విడుదల తర్వాత నుంచి బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగిందని కేంద్ర హోంమంత్రి
అమిత్ షా అన్నారు. అధికారం కోసం మరోసారి కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు
చేస్తోందని దుయ్యబట్టారు. దేశాన్ని విభజించే పర్సనల్ లాను ముందుకు తీసుకెళతామని
కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు.
పేదల
అభ్యున్నతి, దేశ పురోగతి కోసం శ్రమించే పార్టీని
గెలిపించాలని ప్రజలను తాను అభ్యర్థిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. దేశాన్ని షరియా
ప్రకారం ముందుకు తీసుకువెళతారా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
ఉమ్మడి
పౌర స్మృతి తీసుకువస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొందన్నారు.
ట్రిపుల్
తలాక్‌ను రద్దు చేసి యూసీసీని చేపట్టామని, దీన్ని
తాము ముందుకు తీసుకెళతామని మరోసారి తేల్చి చెప్పారు.
భారత్
లో వ్యక్తిగత చట్టాలను అమలు చేయలేమన్న అమిత్ షా, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా
బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.